ఉరవకొండ: కమలపాడు వద్ద అడ్డంగా దొరికిన ఇద్దరు చైన్ స్నాచర్లు
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కమలపాడు గ్రామం వద్ద శుక్రవారం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. కమలపాడు గ్రామ శివారులో బైక్ పై వస్తున్న వారి నుండి చైన్ స్నాచింగ్ చేసి బైక్ పై పరారైన ఇద్దరు దొంగల సమాచారాన్ని బాధితులు చాకచక్యంగా ముందు ఉన్న గ్రామ ప్రజలకు సమాచారం అందించారు. అప్రమత్తమైన గ్రామస్తులు బైక్ పై వస్తున్న చైన్ స్నాచర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దొంగిలించిన బంగారు చైన్లను తీసుకొని దొంగలకు దేహశుద్ధి చేసి వజ్రకరూరు పోలీసులకు అప్పగించారు. *మీ సాక్షి టీవీ లో...*