కనిగిరి: పట్టణంలో కనిగిరి మండలంలోని 25 పంచాయతీల టిడిపి నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు సోమవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి మండలంలోని 25 గ్రామపంచాయతీల టిడిపి నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధికి టిడిపి నాయకులు కృషి చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను టిడిపి నాయకులు రూపొందించాలని, అందుకు అనుగుణంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే టిడిపి నాయకులను ఆదేశించారు.