సంతనూతలపాడు: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలి: చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య
చీమకుర్తి: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ భూతాన్ని ప్రతి ఒక్కరూ తరిమికొట్టాలని చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ వైరామకృష్ణయ్య సూచించారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై స్థానికులకు ఆయన అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించి, వాటి బదులుగా జనపనార లేదా గుడ్డుతో తయారుచేసిన సంచులను ప్రతి ఒక్కరూ వినియోగించాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, తడి చెత్త, పొడి చెత్త వేరుచేసి ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ కార్మికులకు అందజేయాలని కమిషనర్ సూచించారు.