సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు చెరువులో వ్యర్ధాలను తొలగించాలని రైతులు, స్థానికుల డిమాండ్
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు లోని చెరువులో వ్యర్ధాలను తొలగించాలని రైతులు స్థానికులు అధికారులను కోరుతున్నారు. ఉప్పుగుండూరు చెరువులో జమ్మూ మరియు పిచ్చి మొక్కలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయని వారు ఆరోపిస్తున్నారు అధికారులకు సమస్యను ఎన్నిసార్లు విన్నవించిన వారు పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా స్పందించి చెరువులో పెరిగిపోయిన జమ్మూ మరియు పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని వారి కోరుతున్నారు.