కొండపి: సింగరాయకొండ లో చిట్టీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని గాలిస్తున్నామని ఎస్ఐ మహేంద్ర వెల్లడి
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చిట్టిల పేరుతో మోసగించిన శ్రీను అనే వ్యక్తిని గాలిస్తున్నామని ఎస్సై మహేంద్రా బుధవారం మీడియాకు తెలిపారు. నాలుగు గంటల సమయంలో మీడియా సమావేశం నిర్వహించిన మహేంద్ర చిట్టిల పేరుతో శ్రీను అనే వ్యక్తి 26 మందిని మోసం చేసినట్లు వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.