కొండపి: కొండపి వైసిపి నాయకులు సంచలన వ్యాఖ్యలు, పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ విమర్శలు, సంచలనగా మారిన వీడియో
కాసం జిల్లా కొండపిలో జరిగిన వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బొట్ల రామారావు మాట్లాడుతూ.. వైసీపీలో సమన్వయం లోపించిందని నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేశ్ ముందే ఎత్తిచూపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మండల నేతలు కోవర్టుల్లాగా టీడీపీతో కుమ్మక్కయ్యా రన్నారు. ఇటీవల కొండపి పంచాయతీ ఎన్నికలు వస్తే పోటీ చేయకుండా ఆగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బుధవారం సంచలనంగా మారింది. సొంత పార్టీ నేతలు ఇలా సొంత పార్టీ నేతలపై విమర్శలకు దిగడంపై చర్చగా మారింది.