కొండపి: సింగరాయకొండ కొండపి, టంగుటూరు ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వాటిని గుర్తించి శుభ్రం చేసిన పోలీసులు
సింగరాయకొండ, టంగుటూరు, కొండపి మరియు జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలలో పోలీసులు బహిరంగంగా మద్యం సేవిస్తున్న ప్రాంతాలపై దృష్టి సారించారు. మంగళవారం ఎస్పీ ఆదేశాలతో బహిరంగంగా మద్యం తాగుతున్న ప్రాంతాలను గుర్తించి పోలీసులు శుభ్రం చేయించి గాజు సీసాలను తొలగించారు. ఇకమీదట ఈ ప్రాంతాలపై నిఘా ఉంచి బహిరంగంగా మద్యం తాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తీవ్రంగా హెచ్చరించారు.