కొండపి: సింగరాయకొండలో చిట్టీల పేరుతో ఘరానా మోసం చేసిన శ్రీను అనే వ్యక్తి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చిట్టీల పేరుతో శ్రీను అనే వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. రాత్రికి రాత్రి తన ఇంటిని ఖాళీ చేసి తన ఆస్తులు అమ్ముకొని పరారయ్యాడు. మొదట్లో నమ్మకంగా ఉన్న శ్రీనును నమ్మి సింగరాయకొండ లో 25 మందికి పైగా చిట్టీలు వేశారు. అయితే శీను బోర్డు తిప్పేసి పరారు కావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సింగరాయకొండ పోలీసులు బుధవారం తెలిపారు. కోట్ల రూపాయలు స్వాహా చేసి శ్రీను పరారు అయినట్లుగా తెలుస్తుంది.