కొండపి: టంగుటూరు మండల కేంద్రంలోని ఏటీఎం కేంద్రాలను పరిశీలించి, భద్రతను సమీక్షించిన ఎస్సై నాగమల్లేశ్వరరావు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కేంద్రంలోని అన్ని బ్యాంకుల ఎటిఎం కేంద్రాలను మంగళవారం స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు పరిశీలించారు. ఏటీఎం కేంద్రాలలో అలారం మరియు సీసీ కెమెరాల పనితీరు పరిశీలించి ఏటీఎం కేంద్రాల సెక్యూరిటీ గార్డ్లకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఏటీఎం కేంద్రాల సమీపంలో ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సెక్యూరిటీ గార్డులకు సూచించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో భద్రతను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్టు నాగమల్లేశ్వరరావు అన్నారు.