సంతనూతలపాడు: మద్దిపాడు మండలం తెల్లబాడు లో పేకాట శిబిరంపై పోలీసుల దాడులు, పేకాట ఆడుతున్న ఐదుగురి అరెస్ట్
మద్దిపాడు: పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసిన సంఘటన మద్దిపాడు మండలం తెల్లబాడులో సోమవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లబాడు శివారులో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి 10,600 లు నగదును స్వాధీనం చేసుకున్నారు.