రాప్తాడు: శారదా నగర్ శివకోటి శ్రీ పీఠంలో శ్రీ శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని శారద నగర్ లో వద్ద ఉన్న శివకోటి శ్రీ పీఠంలో శనివారం సాయంత్రం 5:30 నుంచి 8:30 గంటల వరకు శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకుడు అరవింద ప్రధానార్చకుడు స్వామి తదితరులు మాట్లాడుతూ ని పురస్కరించుకొని భక్తులకు మంచి జరగాలని ఉద్దేశ్యంతో శనీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు హోమాలు నిర్వహించి శని దోషాలు తొలగించేందుకు ఈ విశేష పూజలు నిర్వహించడం జరిగిందని ఆలయ నిర్వాహకులు అరవింద్ ఆలయ ప్రధాన అర్చకుడు అప్పు స్వామి తదితరులు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.