సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో సామూహిక ధ్యాన శిక్షణ తరగతులు
చీమకుర్తి పట్టణంలో శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక ధ్యానంపై శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రామచంద్ర మిషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.... ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. ధ్యానం చేయడం శారీరక ,మానసిక ఆరోగ్యానికి దివ్య ఔషధంలా పనిచేస్తుందన్నారు. ఒత్తిడిని తగ్గించుకోవడం, పనులపై ఏకాగ్రత ,జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడానికి ధ్యానం ఒక సాధనంలా ఉపయోగపడుతుందన్నారు ధ్యానం ద్వారా రోగ నిరోధక శక్తి పెంపొందుతుంది అన్నారు.