ఉరవకొండ: పిఏబిఆర్ (PABR) డ్యామ్ లో తాగునీటిని సరఫరా చేసే ఇన్ టేక్ వెల్ ను ఆకస్మిక తనికి చేసిన మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం జిల్లా పిఏబిఆర్ (PABR) డ్యామ్ లోని శ్రీరామిరెడ్డి ప్రాజెక్ట్ నుండి ఉరవకొండకు తాగునీటి సరఫరా చేసే ఇన్ టేక్ వెల్ ను ఆదివారం సాయంత్రం రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ తనిఖీ సమయంలో మోటార్లు ఆఫ్ లో ఉండటం, పైగా అక్కడ ఒక్క అధికారి కానీ, కనీసం ఒక్క వర్కర్ కానీ అందుబాటులో లేకపోవడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రస్తుత ఎల్-నినో పరిస్థితులు, తీవ్రమైన నీటి ఎద్దడి అధికారులు నిర్లక్ష్యంపై కలెక్టర్ కి ఫోన్ చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించారు.