ఏడాది పాలనపై సుపరిపాలనలో తొలిఅడుగు పేరుతో రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వవిప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు. శనివారం ఉదయం పట్టణంలోని 10 వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాలు వివరించారు. లభ్థదారులతో మాట్లాడుతూ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. తమ వార్డులో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయిలని మహిళలు ఎమ్మెల్యే ను కోరారు. గాంధీ మున్సిపల్ పాఠశాల స్థలాన్ని ఆక్రమించారని, ప్రహరీ గోడ లేక పోవడంతో పాఠశాలలో వస్తువులకు రక్షణ లేకుండా పోతోందని కాంపౌండ్ వాల్ నిర్మించాలని ఉపాధ్యాయులు కోరారు.