రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీ ఆంజనేయులుపై చర్యలు తీసుకోవాలని వైస్ ఛాన్స్లర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి వద్ద ఉన్న శ్రీకృష్ణదేవ విశ్వవిద్యాలయంలో సోమవారం మూడు గంటల 50 నిమిషాల సమయంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గిరి ఆధ్వర్యంలో ఉపకులపతి జ్యోతి కుమార్ ను కలిసి ప్రిన్సిపల్ ఆంజనేయులు పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గిరి మాట్లాడుతూ పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో అకాడమీ కన్సల్టెన్సీ విద్యార్థులపై ప్రిన్సిపల్ ఆంజనేయులు దొంగలంటూ దుర్భాషలాడడం జరిగిందని ఇలాంటి ప్రిన్సిపల్ ఆంజనేయులుపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తరిమెల గిరి డిమాండ్ చేశారు .