కనిగిరి: వెలిగండ్ల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పామూరు సిఐ వినోద్
వెలిగండ్ల పోలీస్ స్టేషన్ ను పామూరు సిఐ వినోద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని బలు రికార్డులను సిఐ వినోద్ పరిశీలించారు. వెలిగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించిన సిఐ వినోద్... పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక ఎస్సై కృష్ణ పావనిని ఆదేశించారు. వేసవిలో దొంగతనాల నివారణకు పోలీస్ గస్తీని ముమ్మరం చేయాలని సిఐ ఆదేశించారు. గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా గ్రామస్తులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.