రాప్తాడు: బొమ్మపర్తిలో శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా రైతు నారాయణరెడ్డి కి చెందిన టమోటా పంట నేలకు ఒరిగి పంట నష్టం
రాప్తాడు మండలంలోని బొమ్మపర్తి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో భారీ వర్షాల కారణంగా రైతు నారాయణ రెడ్డి కి చెందిన రెండు ఎకరాల్లో టమోటా పంట నేలకోరికి పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఈ సందర్భంగా రైతు నారాయన్ రెడ్డి శుక్రవారం 11 గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం కారణంగా రెండు ఎకరాల్లో సాగుచేసిన టమోటా పంట ద్రాక్ష పందిరి పూర్తిగా కూలిపోయి పెట్టిన పెట్టుబడి అంతా కూడా నష్టపోవడం జరిగిందని తనను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని బొమ్మిపర్తి గ్రామానికి చెందిన రైతు నారాయణరెడ్డి పేర్కొన్నారు.