ఉరవకొండ: శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక సంకష్టహర చతుర్థి పూజలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని వినాయక నగర్ లో వెలసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో సామూహిక సంకష్టహర చతుర్థి పూజా కార్యక్రమాలను కనుల పండువగా నిర్వహించారు. ఆలయంలో స్వామి వారి మూలవిరాట్ కు పంచామృత అభిషేకాలు, పుష్పాలంకరణ లు చేసి మహా మంగళ హారతి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సామూహిక సంకష్టహర చతుర్థి పూజల్లో మహిళా భక్తులు ఉపవాస దీక్షలతో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. పూజలు అనంతరం తీర్థప్రసాద కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు దాతలు కలసి నిర్వహించారు.