రాప్తాడు: మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు ఏడు కోట్ల విల్లా ఎలా కొన్నావు చెప్పు అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శనివారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన మూడు నెలలకే 7 కోట్ల విలువచేసే విల్లా ఎలా కొన్నాడు ప్రజలకు సమాధానం చెప్పాలన్నాడు అదేవిధంగా గుండుమల్లె తిప్పే స్వామికే నువ్వు చేసిన అన్యాయం గురించి ఏ కార్యకర్తలను అడిగినా సమాధానం చెప్తారని ఇతరులను ప్రశ్నించేటప్పుడు తాము ఏమి చూస్తున్నాము తెలుసుకుంటే మంచిదని ఎమ్మెస్ రాజు పై తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పలు విమర్శలు చేశారు.