కనిగిరి: పట్టణంలో క్షుద్ర పూజల కలకలం, క్షుద్ర పూజలు చేశారని ఆందోళన చెందిన ఓ కుటుంబం
కనిగిరి పట్టణంలో శుక్రవారం క్షుద్ర పూజల కలకలం రేపింది. పట్టణంలోని కాశీనాయన ఆశ్రమం కు వెళ్ళు దారిలో సీనియర్ జర్నలిస్ట్ సత్యం రెడ్డి నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటి ముందు ఉదయం ముగ్గు వేసి ఉండడంతో పాటు పసుపు కుంకుమతో మధ్యలో కోడిగుడ్డు ఉంచి, గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేశారు. ముగ్గు వేసి పూజలు చేసిన కింద భాగంలో సత్యం అని పేరు రాసి, పూజలు చేసినట్లు ఆనవాళ్లు ఉండడంతో, క్షుద్ర పూజలు జరిగాయని సత్యం రెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.