కనిగిరి: పట్టణంలో ఈనెల 8న మెగా జాబ్ మేళా కార్యక్రమం: జిల్లా స్క్రీన్ డెవలప్మెంట్ అధికారి కంచిబాబు
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రామం నందు ఈనెల 8న శుక్రవారం ఏపీ స్పీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా శిల్ డెవలప్మెంట్ అధికారి కంచిబాబు గురువారం తెలిపారు. ఐటిఐ, ఇంటర్, డిప్లమా, డిగ్రీ, బీటెక్ చదివిన నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాకు నేరుగా సర్టిఫికెట్లతో హాజరు కావచ్చు అన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.13500 లు నుండి రూ.21,000 లు వరకు ఆయా కంపెనీలు వేతనాన్ని అందిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.