సంతనూతలపాడు: చీమకుర్తి మండలం మర్రిపాలెం లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి అందులోని విలువైన వస్తువులు చోరీ చేసిన దుండగులు
చీమకుర్తి మండలం మర్రిపాలెంలో పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు ట్రాన్స్ఫారం ధ్వంసం చేసి, అందులోని విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని రైతు బోడపాటి సుబ్బారావు గురువారం తెలిపారు. గుర్తుతెలియని దొంగలు దిమ్మె పై నుంచి ట్రాన్స్ఫారం కిందకు పడేసి అందులోని విలువైన వస్తువులను దొంగతనం చేశారని పేర్కొన్నారు. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు దృష్టికి తీసుకు వెళ్లానని, తదుపరి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేసినట్టు రైతు తెలియజేశారు.