రాప్తాడు: చిన్మయి నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో ఏపీ ఈసెట్ 2026 పరీక్షలను పరిశీలించిన చైర్మన్ హెచ్ సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో గురువారంమధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఏపీ ఈసెట్ 2026 చైర్మన్ సుదర్శన్ రావు ఏపీ ఈసెట్ పరీక్షలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ఈసెట్ 2026 చైర్మన్ సుదర్శన్ రావు మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 33,751 మంది విద్యార్థులు ఏపీ ఈసెట్ 2026 కు దరఖాస్తు చేసుకోగా 32 వేల 754 మంది విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్షలకు హాజరు కావడం జరిగిందని ఏపీ ఈసెట్ 2026 చైర్మన్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈసెట్ కన్వీనర్ దుర్గాప్రసాద్ భానుమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు.