ఉరవకొండ: పెన్న అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి, విఫ్ లు
అనంతపురం జిల్లా ఉరవకొండ మండల సమీపంలో ఉన్న శ్రీ శ్రీ పెన్న అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారికి బుధవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక,వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్, మరియు ప్రభుత్వ విఫ్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తో కలసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం రథోత్సవ కార్యక్రమంలో బాగంగా ముందు జరిగే మడుగుతేరు కార్యక్రమాల్లో మంత్రి, ప్రభుత్వ విఫ్ లు పాల్గొన్నారు.