రఘునాథపల్లె: గొర్రెల పెంపకందారుల డిమాండ్లు: ప్రభుత్వం ఉచిత షెడ్లు, నీటి తోట్లు నిర్మించాలి
జనగామ జిల్లా రఘునాథపల్లిలో గొర్రెలు, మేకల పెంపకందారుల సమస్యలపై సర్వే నిర్వహించిన GMPS. దొంగల బెడద, కుక్కల దాడుల నివారణకు సమీకృత షెడ్లు, నీటి ఎద్దడిని అరికట్టేందుకు ప్రతి గ్రామంలో ఐదు నీటి తోట్లు నిర్మించాలని సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు గుండా వెంకటయ్య ప్రభుత్వాన్ని కోరారు.