రఘునాథపల్లె: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై 74 అర్జీలు స్వీకరణ
సోమవారం ప్రజావాణి నీ పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్ రోహిత్ సింగ్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల వద్ద నుండి విజ్ఞాపన లను స్వీకరించి.. ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈనాటి ప్రజావాణి కార్యక్రమనికి 74 విజ్ఞప్తులు వచ్చాయి అనంతరం వివిధ అంశాల పైన కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ....ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రగతి సాధించాలన్నారు