సంతనూతలపాడు: రుద్రవరంలో పర్యటించిన ఎంపీడీవో సురేష్ బాబు, వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం
సంతనూతలపాడు మండలం రుద్రవరంలో ఎంపీడీవో సురేష్ బాబు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మంచినీటి వనరులైన మంచినీటి బావులు, మరియు ఓవర్ హెడ్ ట్యాంకులను ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి ఎంపీడీవో పరిశీలించారు. మంచినీటి బావులు, ఓవర్ హెడ్ ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి, క్లోరినేషన్ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న పైప్ లైన్లకు మరమ్మత్తులు చేపట్టి నేటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఆదేశించారు.