సంతనూతలపాడు: చీమకుర్తి మండలం కె.వి అగ్రహారంలో మృతదేహాలను పరిశీలించి, దర్యాప్తు చేపట్టిన ఒంగోలు డిఎస్పి శ్రీనివాసరావు
చీమకుర్తి మండలం లోని కెవి అగ్రహారంలో తన ముగ్గురు కుమార్తెలకు సుధాకర్ అనే వ్యక్తి విషమిచ్చి చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం గ్రామానికి చేరుకున్న ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... మృతుడు సుధాకర్ భార్య అతనిని విడిచి వెళ్లిపోయిందన్నారు. ముగ్గురు ఆడపిల్లలతో కలిసి సుధాకర్ గ్రామంలో నివసిస్తున్నాడని తెలిపారు. ఇంట్లో ఆడపిల్లలు ముగ్గురు చనిపోగా, సుధాకర్ పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.