రాప్తాడు: హంపాపురం గ్రామ సమీపంలో ఆగి ఉన్న సిమెంటు లారీని ఢీ కొట్టి 32 సంవత్సరాల భాస్కర్ రెడ్డి అనే లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని హంపాపురం గ్రామ సమీపంలో బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఆగి ఉన్న సిమెంట్ లారీని మరొక లారీ ఢీ కొట్టి భాస్కర్ రెడ్డి అనే లారీ డ్రైవర్ అక్కడక్కడే మృతిచెందరం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు స్థానిక పోలీసులు తెలిపిన సమాచారం మేరకు హంపాపురం గ్రామ సమీపంలో బుధవారం 7:30 గంటల సమయంలో హైదరాబాదు నుంచి బెంగళూరుకు గ్రానైట్ లోడ్ తో లారీ హంపాపురం గ్రామ సందిపంలో సిమెంట్ లారీని వేగంగా ఢీకొట్టడంతో డ్రైవర్ భాస్కర్ రెడ్డి లారీ క్యాబిన్లోని ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని ఈ సంఘటన పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.