ఉరవకొండ: పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన గ్రామీణ విద్యార్థులు. బెలుగుప్ప మండల టాపర్ గా 578 మార్కులను సాధించిన ఇందు హాసిని
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీనివాసా విద్యానికేతన్ లో విద్యనభ్యసిస్తున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులు గురువారం ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో ఎర్రగుడి గ్రామానికి చెందిన ఇందు హాసిని ఉత్తమ మార్కులతో 578/600 మండల టాపర్ గా నిలిచింది. పాఠశాలలో మానస 570 మార్కులు, మైథిలి, హరిణిలు 568 మార్కుల చొప్పున సాధించి ప్రతిభను చాటారని కరస్పాండెంట్ శ్రీనివాసులు హెచ్ఎం సుమలు పేర్కొన్నారు.