బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారికి ఎస్సై నాగమల్లేశ్వరరావు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధించారు. బుధవారం టంగుటూరు మండలంలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిని గుర్తించిన ఎస్ఐ నాగమల్లేశ్వరరావు వారిని తీవ్రంగా మందలించారు. అంతేకాకుండా జరిమానా విధించి మద్యం తాగిన ప్రాంతాలను వారితోనే పరిశుభ్రం చేయించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్న వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు ఎస్సై తెలిపారు.