కనిగిరి: గత వైసీపీ ప్రభుత్వంలో కనిగిరి నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో గ్రహణం పట్టింది: తెలుగు యువత అధ్యక్షులు సురేష్ రెడ్డి
కనిగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో కనిగిరి నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు సురేష్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... గత వైసిపి ప్రభుత్వం లో అభివృద్ధి విషయంలో కనిగిరి నియోజకవర్గానికి గ్రహణం పట్టిందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనను వెన్నుపోటు పాలనతో పోలుస్తూ వైసిపి కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ నిరసన ర్యాలీ చేపట్టడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. గతంలో ఎవరు చేయని అభివృద్ధి ఎమ్మెల్యే చేస్తున్నారన్నారు.