సంతనూతలపాడు: మహానాడు కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలి: సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు నియోజకవర్గంలో క్లస్టర్ల వారీగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని సంతనతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ సూచించారు. మంగళవారం సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో మహానాడు ఏర్పాట్లపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ టిడిపి నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు ను వర్చువల్ గా క్లస్టర్ల వారిగా నిర్వహిస్తుంది అన్నారు. ప్రతి క్లస్టర్లో మహానాడు సందర్భంగా భారీ ఎల్ఈడి స్క్రీన్ లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే నాయకులను ఆదేశించారు.