కనిగిరి: కనిగిరి నియోజకవర్గం లో బిజెపిని బలోపేతం చేయాలి: మార్కాపురం జిల్లా బిజెపి అధ్యక్షులు పివి కృష్ణారావు
కనిగిరి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని బిజెపి మార్కాపురం జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారావు కనిగిరి నియోజకవర్గం బిజెపి నాయకులకు సూచించారు. ఆదివారం మార్కాపురంలో జిల్లా అధ్యక్షునిగా పీవీ కృష్ణారావు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరగగా ఈ కార్యక్రమానికి కనిగిరి నియోజకవర్గ బిజెపి నాయకులు హాజరై పివి కృష్ణారావును అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ... బిజెపిని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందిస్తున్న సహకారం, ప్రజలకు చేస్తున్న మేలు క్షేత్రస్థాయిలో వివరించాలన్నారు.