కనిగిరి: పామూరు పట్టణం లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు: పామూరు సిఐ వినోద్
పామూరు పట్టణం లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఐ వినోద్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పట్టణంలో ఆక్రమణలు తొలగించి, ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు చేపడతామన్నారు. పామూరు సర్కిల్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు పాల్గొన్నారు. పేకాట, కోడిపందాలపై నిర్భయంగా పోలీసులకు ప్రజలు సమాచారం తెలపొచ్చన్నారు. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల సహకారానికి ప్రజలు సహకరించాలన్నారు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.