రాప్తాడు: కృష్ణంరెడ్డిపల్లి వద్ద సిపిఐ పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కృష్ణం రెడ్డి పల్లి క్రాస్ వద్ద శుక్రవారం నాలుగు గంటల యాభై నిమిషాల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి సిపిఐ పార్టీ నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వైయస్ షర్మిల రెడ్డి మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని మహాత్మా గాంధీజీ పేరును కూడా కొనసాగించాలని 100% నిధులు కేంద్రమే విడుదల ఇచ్చేయాలని వీటిని అన్నిటికైనా పోరాటాలు చేస్తుందని ఈ పోరాటాలకు తాము మద్దతు చిలిపి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగే వరకు పోరాటాలు చేస్తామని వైయస్ షర్మిల రెడ్డి పేర్కొన్నారు.