ఉరవకొండ: వ్యవసాయ కూలీలతో వెళుతున్నఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో మహిళా కూలి మృతి పలువురికి గాయాలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం, ఎర్రగుడి గ్రామానికి చెందిన హరిజన గంగమ్మ(67) గురువారం వెంకటాద్రి పల్లి ఎర్రగుడి గ్రామాల మధ్య అదుఫు తప్పి ఆటో బోల్తా పడిన ఘటనలో మృతి చెందింది.వెంక టాద్రి పల్లి గ్రామంలో ఓ రైతు పొలంలో టమోటా నాట్లు వేయడాని గాను తలారి పాతన్న ఆటోలో తోటి కూలీలతో కలసి వెళుతుండగా ఆటో అదుపు చేయలేక ఆటోను రోడ్డు కు ఎడమ వైపున బోల్తా వెయ్యడంతో ఆటోలో ప్రయాణిస్తున్న హరిజన గంగమ్మ కు తీవ్ర గాయాలై చనిపోగా, ఆటోలో ప్రయాణిస్తున్న ఇంకా కొంతమందికి రక్త గాయాలు అయినాయి. మృతురాలి కొడుకు లక్ష్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై శివ పేర్కొన్నారు.