కళ్యాణదుర్గం: మన రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంటులో ఆమోదం పొందడం చాలా సంతోషం: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు
మన రాష్ట్ర రాజధానిగా అమరావతి పార్లమెంటులో ఆమోదం పొందడం చాలా సంతోషమని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలో బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లు అమరావతి రాజధానిగా చట్టబద్ధత రావడం ఐదు కోట్ల ఆంధ్రుల అదృష్టమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కృషి వల్ల రాజధానికి చట్టబద్ధత వచ్చిందన్నారు. ప్రజలందరూ సంతోషపడుతున్నారన్నారు.