యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న ఎమ్మార్వో మంజునాథరెడ్డి
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ప్రభుత్వ భూములను కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు సుదర్శన్ ఆర్డీవో ప్రభాకర్ వినతి పత్రం అందజేశారు. దీంతో ఆర్డీవో ఆదేశాలతో ఎమ్మార్వో మంజునాథరెడ్డి ప్రభుత్వ భూములను సర్వే చేశారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.