ఉరవకొండ: సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో 1.2 ఎకరాల్లో రైతు సాగు చేసిన పండ్ల తోటలను పరిశీలించిన ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం గుండ్లపల్లి గ్రామంలో రామాంజనేయులు అనే రైతు థాయిలాండ్ మరియు దేశంలో వివిధ అత్యున్నతమైన ఉద్యాన పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలను సంప్రదించి తనకున్నటువంటి 1.2 ఎకరాలలో సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ప్రయోగాత్మకంగా వినూత్నంగా సాగైన ఉద్యాన పంటలను ఉద్యాన శాఖ అధికారులు ఆదివారం పరిశీలించారు. రైతు తన పొలంలో సుమారు మామిడి ,పనస, జామ,అరటి , అవకాడో , లొంగాన్, సీతాఫలం తదితర రకాలైనటువంటి పండ్లతోటను పండించడం జరుగుతుంది, ఇలా ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తూ కొత్త మరియు సాంప్రదాయ వంగడాల వంగడాలను కూడా సాగు చేస్తున్నారు.