కనిగిరి: పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ ఇంటర్ విద్యార్థులు మానసికంగా కృంగిపోకూడదు: పామూరు సిఐ వినోద్ కుమార్
పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ ఇంటర్ విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు. బుధవారం ఇంటర్ మొదటి మరియు ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిల్ అయినప్పటికీ, విద్యార్థులు మానసికంగా కృంగిపోవద్దన్నారు పరీక్షలు అన్న తర్వాత గెలుపు, ఓటములు సహజమని, ఫెయిల్ అయ్యామని విద్యార్థులు కృంగిపోకుండా పట్టుదలతో చదివి పరీక్షల్లో మళ్లీ విజయం సాధించాలన్నారు క్షణికావేశంలో విద్యార్థులు అనాలోచిత నిర్ణయాలకు పాల్పడి తల్లిదండ్రులను ఆవేదనకు గురి చేయవద్దని సూచించారు.