కనిగిరి: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన RDO వెంకట శివరామిరెడ్డి
కనిగిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ వెంకట శివరామరెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం సమావేశం అయ్యారు. ఓటర్ల జాబితా రూపకల్పనపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డిఓ చర్చించారు. హోటల్లో జాబితాలో డబుల్ ఎంట్రీ ఓట్లు, మరణించిన వారి ఓట్లను తొలగించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. అదేవిధంగా తప్పులు లేని ఓటర్ల జాబితా లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. మండల స్థాయిలో బిఎల్వోల సమావేశం ఏర్పాటు చేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆర్డీవోను కోరగా... త్వరలోనే మండల స్థాయిలో బిఎల్వోల సమావేశం ఏర్పాటు చేస్తామని ఆర్డిఓ హామీ ఇచ్చారు.