సంతనూతలపాడు: మద్దిపాడు మండలం పెద్దకొత్తపల్లి లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ కార్యక్రమం
మద్దిపాడు మండలంలోని పెద్దకొత్తపల్లి లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషణ పకోడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ డాడీ పేరుతో చిన్నారుల తండ్రులచే పౌష్టికాహారంతో వంటలను చేయించి చిన్నారులకు అందించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి మాట్లాడుతూ.... అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని బాలింతలు మరియు గర్భవతులు క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఐరన్ లోపం ఉన్నవారు ఐరన్ టాబ్లెట్స్ ను వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ ను వాడాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.