ఉరవకొండ: బెళుగుప్పలో శ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం. -నేడు రథోత్సవం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో శ్రీ విరూపాక్షేశ్వర స్వామి ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి ఈశ్వర స్వామి ఆధ్వర్యంలో స్వామివారి ఆరాధన మహోత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆరాధన ఉత్సవంలో భాగంగా ఆలయంలో పంచామృత అభిషేకాలు ఏక వార రుద్రాభిషేకం భజన కార్యక్రమాలను నిర్వహించారు. సోమవారం ఆలయంలో రతాంగ ప్రకరణ హోమం రథ బలి పూర్ణాహుతి హోమాల అనంతరం మధ్యాహ్నం మూడు గంటల నుండి పురవీధుల గుండా రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పీఠాధిపతి ఈశ్వర స్వామి పేర్కొన్నారు.