కనిగిరి: చంద్రశేఖరపురం మండలం అడ్డరోడ్డు వద్ద ట్రాక్టర్, మోటార్ బైక్ డి, ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
చంద్రశేఖరపురం: ట్రాక్టర్, మోటార్ బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన చంద్రశేఖరపురం మండలంలోని శీలం వారి పల్లి అడ్డరోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది .అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రశేఖరపురం అడ్డరోడ్డు వద్ద ట్రాక్టర్, మోటార్ బైక్ ఢీకొనడంతో అభిషేక్, అనుక్ అనే ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ప్రమాదం పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.