సంతనూతలపాడు: మైనంపాడు లో ఉపాధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో సురేష్ బాబు
సంతనూతలపాడు మండలం మైనంపాడు లో జరుగుతున్న ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో ఎంపీడీవో సురేష్ బాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీల హాజరు శాతాన్ని ఆయన పరిశీలించారు. పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, వారికి మంచినీరు అందించాలని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ఎంపీడీవో ఆదేశించారు. ఉపాధి పనులలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని ఎంపిడిఓ హెచ్చరించారు.