కనిగిరి: వెలిగండ్లలో ఎరువులు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల వ్యవసాయ శాఖ అధికారి శిల్ప
వెలిగండ్లలో ఎరువులు దుకాణాలను వెలిగండ్ల మండల వ్యవసాయ శాఖ అధికారి శిల్ప బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇకపై ఎరువుల విక్రయాలు ఫార్మర్ మొబైల్ యాప్ ద్వారా కొనసాగించాలని ఎరువుల దుకాణాల యజమానులకు, రైతులకు సూచించారు. ఫార్మర్ మొబైల్ యాప్ ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఎరువుల అక్రమ రవాణాను అరికట్టవచ్చు అన్నారు. రైతులు తమ గ్రామాలలోని రైతు సేవా కేంద్రాలకు వెళ్లి పంటల వివరాలను అప్డేట్ చేయించుకోవాలని సూచించారు.