సంతనూతలపాడు: మద్దిపాడులోని అంబేద్కర్ నగర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
మద్దిపాడు లోని అంబేద్కర్ నగర్ లో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరమైన మాట్లాడుతూ... రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను భారీగా పెంచి అందజేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పెన్షన్లను అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.