రాప్తాడు: హనీ ట్రాప్ లో నిందితులకు సహకరించిన శ్రీహర్షను విధులనుంచి డిస్మిస్ చేయాలి రాప్తాడులో సిపిఎం పార్టీ రామాంజనేయులు డిమాండ్
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో అనంతపురం రూరల్ సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ రాప్తాడు సిఐ శ్రీహర్ష హనీ ట్రాప్ కేసులో నిందితులకు సహకారం అందించడం జరిగిందని ఇలాంటి సీఐ శ్రీహర్షను విధుల నుంచి డిస్మిస్ చేయకుండా విఆర్ కు పంపించడం సరైన పద్ధతి కాదని ఇలాంటి సీఐపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి విధుల నుంచి పూర్తిగా డిస్మిస్ చేయాలని అనంతపురం రూరల్ సిపిఎం పార్టీ ప్రాంతీయ కార్యదర్శి రామాంజనేయులు డిమాండ్ చేశారు.