సంతనూతలపాడు: నాగులుప్పలపాడు ఎంపీడీవో కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి ఆధ్వర్యంలో జనగణన పై ఉద్యోగులకు శిక్షణ
నాగులుప్పలపాడు ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు జనగణన పై శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి జనగణన పై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఇంటింటికి వెళ్లి పక్కాగా జన గణన చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన ఫార్మేట్లో జనగణన సాగాలని సూచించారు. తప్పులు లేకుండా జనగణన జరపాలని ఆదేశించారు.